నందమూరి నట సింహం బాలకృష్ణ ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరో పక్క ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టాప్ షో కు సంబంధించిన రెండు సీజన్ లు కూడా విజయవంతంగా పూర్తి అయ్యాయి . కెరియర్ లో మొట్ట మొదటి సారి హోస్ట్ గా వ్యవహరించినప్పటికీ బాలకృష్ణ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఈ రెండు సీజన్ లను కూడా అద్భుతమైన విజయం సాధించేలా చేశాడు. 

ఇది ఇలా ఉంటే ఈ టాక్ షో ద్వారా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ క్రేజ్ కూడా విపరీతం గా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అన్ స్టాపబుల్ షో కు హోస్ట్ గా వ్యవహరించి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ క్రేజ్ పెరగడానికి దోహదపడిన బాలకృష్ణ మరోసారి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

అసలు విషయం లోకి వెళితే ... మరి ఈ సారి తెలుగు ఇండియన్ ఐడల్ 2 లో బాలకృష్ణ యంగ్ సింగర్స్ ని ఆశీర్వదించడాని రానున్నట్లు ఆహా ప్రకటించింది . ఈ స్పెషల్ ఎపిసోడ్స్ ని ఈ మార్చ్ 17, 18 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకు రానున్నట్టుగా కూడా కన్ఫర్మ్ చేశారు. ఇలా బాలకృష్ణ మరోసారి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనన్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: