‘ఆహా’ లో సంచలనం సృష్టించిన ‘అన్ ష్టాపబుల్’ షో ఘన విజయానికి తెర ముందు కనిపించిన బాలకృష్ణ ఒక కారకుడు అయితే ఆ షోను చాల డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడంలో చక్కని స్క్రిప్ట్ అందించిన బివిఎస్ రవి మరో ప్రధాన కారకుడు. సినిమా రచయితగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఇతడు అనేక సక్సస్ ఫుల్ సినిమాలకు స్క్రిప్ట్ అందించి ఆతరువాత దర్శకుడుగా మారి సక్సస్ సాధించాలని చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు.


ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి రవికి ఒక అవకాశం ఇస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఇప్పటికే తన తండ్రి నటిస్తున్న అనేక సినిమాలకు కాష్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి ప్రశంసలు అందుకుంది. అయితే నిర్మాతగా రాణించాలి అన్న కోరిక ఉండటంతో ఈమధ్యనే యంగ్ హీరో శోభన్ హీరోగా పెట్టి ఒక చిన్న సినిమా తీసినప్పటికీ ఆసినిమా విజయవంతం కాలేదు.


దీనితో ప్రముఖ నిర్మాతగా మారాలి అన్న తన కూతురి కల నిజం చేసేందుకు స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగుతున్నాడు. తనతో ఒక భారీ సినిమా నిర్మించేందుకు చిరంజీవి తన కూతురుకి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగానే రచయిత రవి చెప్పిన ఒక స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చడంతో ఆ స్టోరీ లైన్ డెవలప్ చేయమని రవికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కథ స్క్రిప్ట్ గా మారిన తరువాత చిరంజీవికి పూర్తిగా నచ్చితే తన కూతురుని నిర్మాతగా చేసి ఈ మూవీని నిర్మించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


వాస్తవానికి దర్శకులు నక్కిన త్రినాధ్ రావ్ తో సినిమా చేయాలని చిరంజీవి ఆలోచిస్తున్నప్పటికీ మధ్యలో దర్శకుడు రవి రంగంలోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. 68 సంవత్సరాల వయసులో కనీసం సంవత్సరానికి రెండు సినిమాలు తన వైపు నుండి ఉండేలా చిరంజీవి అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: