ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం తాజాగా  పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల కీలక పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండవ భాగాన్ని 28 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "ఆగనందే" అనే మొదటి పాట విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది.

మూవీ లోని మొదటి పాటను మార్చి 20 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో కార్తీ మరియు త్రిష లు ఉన్నారు. ఈ పోస్టర్ లో కార్తీ కళ్ళకు గంతలు కట్టి ఉండగా ... త్రిష చేతిలో ఒక పొడవాటి కత్తి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: