నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో దసరా అనే మూవీ లో హీరో గా నటించాడు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కారుక్రమాలను కూడా ఈ మూవీ బృందం పూర్తి చేసింది.

మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే సెన్సార్ సభ్యుల నుండి ఈ మూవీ కి సంబంధించిన కొంత రివ్యూ బయటికి వచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లోని ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అద్భుతంగా వచ్చినట్లు ... ఈ రెండు సన్నివేశాలు ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు సెన్సార్ బోర్డ్ సభ్యుల నుండి ఓ న్యూస్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలను ఈ మూవీ కనుక అందుకున్నట్లు అయితే భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: