తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూజ హెగ్డే ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది.

ఇది ఇలా ఉంటే కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు , తమిళ భాషలో అనేక సినిమాల్లో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీ లో కూడా కొన్ని మూవీ లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా పూజా హెగ్డే హిందీ లో సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందిన "కిసికా బాయ్ కాసికా జాన్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... జగపతి బాబు ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు సమాచారం. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: