నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాని ఊర మాస్ పాత్రలో నటించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నిన్న అనగా మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది.

మూవీ పై మొదటి నుండి సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ మొదటి రోజు భారీ సంఖ్యలో థియేటర్ లలో విడుదల అయింది. అలాగే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ లభించింది. దానితో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి సూపర్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి.

 ఇది ఇలా ఉంటే మరి ముఖ్యంగా ఈ మూవీ కి నైజాం ఏరియా లో మొదటి రోజు భారీ కలెక్షన్ లు లభించాయి. ఈ మూవీ నైజాం ఏరియాలో మొదటి రోజు 6.78 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాలలో నైజాం ఏరియాలో అత్యధిక షేర్ కలక్షన్ వసూలు చేసిన సినిమాలలో దసరా మూవీ మొదటి స్థానంలో నిలిచింది  ఈ మూవీ కి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు లాంగ్ రన్ లో భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మూవీ రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: