పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే పవన్ కళ్యాణ్ అనేక మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా తమిళ సినిమా అయిన వినోదయ సీతం కు తెలుగు లో రీమేకా రూపొందుతున్న సినిమా షూటింగ్ ను కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పూర్తి చేశాడు.

మూవీ కి సముద్ర ఖని దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ ఒక కీలక పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మరియు సుజిత్ దర్శకత్వంలో "ఓ జి" అనే రెండు మూవీ లకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా పవన్ మరి కొన్ని రోజుల్లోనే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ ను ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో శ్రీ లీల ... పవన్ సరసన హీరోయిన్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో చెక్కర్లు కొడుతుంది. అసలు విషయం లోకి వెళితే ... చాలా రోజుల క్రితమే ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ రైట్స్ ను మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు ఒక టాక్ వినబడుతుంది. ఇప్పటి ధరలతో పోల్చుకుంటే చిత్ర బృందం చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మైత్రి మూవీ సంస్థ నిర్మించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: