తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటు మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో శివ కార్తికేయన్ ఒకరు. ఈ హీరో ఇప్పటికే అనేక విజయాలను కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ హీరో తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాడు. శివ కార్తికేయన్ తమిళ్ నుండి తెలుగు లోకి డబ్బింగ్ అయినటు వంటి వరుణ్ డాక్టర్ ... కాలేజ్ డాన్ మూవీ లతో మంచి విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

 అలాగే తాజాగా తెలుగు దర్శకుడు అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ అనే మూవీ లో ఈ హీరో నటించాడు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శివ కార్తికేయన్ "మా వీరన్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ నెలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: