కన్నడ బ్యూటీ పూజా హెగ్డే కు గత సంవత్సరం ఏమాత్రం కలిసి రాలేదు. ఆమె నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ కావడంతో ఆమె లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకుంది. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఆమె ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంలో ఆమె సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడి డేటింగ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల పై స్పందించింది.  


సల్మాన్ ఖాన్ తో తను డేటింగ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల పై నిజం లేదని చెపుతూ తాను సల్మాన్ కు వీరాభిమానిని మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. వచ్చేవారం సల్మాన్ రంజాన్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ విడుదలకాబోతున్న ఈమూవీలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుంటే రామ్ చరణ్ ఒక పాటలో కనిపించబోతున్నాడు.  

ప్రస్తుతం తాను సోలోగానే ఉన్నానని తాను ఎవరి ప్రేమలోను పడలేదని పూజా చెపుతూ తన ఫ్యామిలీతో తాను హాయిగా ఉన్నానని తనకు ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదు అని అంటోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తో మూవీలో నటిస్తున్న ఈమెకు ఆసినిమాలో చాల కీలక పాత్ర వచ్చిందని చెపుతున్నారు.


త్రివిక్రమ్ కు ఈమె సెంటిమెంట్ హీరోయిన్ గా మారడంతో ఆమె మూడవసారి త్రివిక్రమ్ తో పనిచేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అలియా భట్ పెళ్ళి చేసుకుని తల్లి కావడంతో జాన్వీ కపూర్ దక్షిణాది సినిమాల వైపు చూస్తూ ఉండటంతో పాటు కియారా అద్వానికి కూడ పెళ్ళి అయిపోవడంతో పూజ తిరిగి బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి ఈమూవీ ద్వారా ప్రయత్నిస్తోంది. తెలంగాణ సాంప్రదాయానికి చెందిన బతుకమ్మ పాట ఈమూవీలో హైలెట్ అని అంటున్నారు. ఈమూవీలో చరణ్ వెంకటేష్ లు కూడ నటించడంతో ఈసినిమా పట్ల తెలుగు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: