మలయాళంలో రీసెంట్ గా రిలీజై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా "2018". మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక కేరళలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మే 26 వ తేదీన తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి పాజిటీవ్ టాక్ వస్తోంది. చూసిన ప్రతీ ఒక్కరు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా దర్శకుడు సెకండాఫ్‌ ను నడిపించిన విధానానికి అయితే ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అవుతున్నారు. కనురేప్పేవేయడానికి కూడా వీల్లేకుండా ప్రేక్షకుడిన కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుంటోంది.


అందువల్ల ఈ సినిమా తెలుగులో కూడా భారీ విజయం సాధించడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకా ఈ మధ్యకాలంలో ఈ రేంజ్ లో పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. తెలుగులో మొదటి రోజు ఈ  సినిమా ఏకంగా కోటికిపైగా వసూళ్లు రాబట్టి షాక్ ఇచ్చింది. పోటీగా విపరీతమైన బజ్ వున్న మేం ఫేమస్, మళ్ళీ పెళ్లి సినిమాలు వున్నా కూడా 2018 మాత్రం ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయ్యి వాటికంటే ఎక్కువ వసూళ్ళని నమోదు చేసింది.ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమి లేకపోవడం  ఈ సినిమాకు పాజిటీవ్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి సినిమాకు తెలుగులో కూడా మున్ముందు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం తెలుస్తుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని డేస్ ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: