బండ్ల గణేష్ కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత అందరికీ ఊహించని షాక్ ని ఇస్తూ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతగా మారారు.

ఆయన పేరు తీస్తే పవన్ కళ్యాణ్  అయితే గుర్తుకు వస్తాడు. అంత పెద్ద వీరాభిమాని ఆయన, స్టేజి మీద మైక్ అందుకుంటే పవన్ జపంతో తెగ ఊగిపోతాడు. పవన్ ని ఉద్దేశిస్తూ ఆయన గురించి పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్ ప్రసంగాలు కూడా ఇస్తూ ఉంటాడు.

పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు వస్తున్నారా అనేది చూడరు ఫ్యాన్స్, బండ్ల గణేష్ వస్తున్నాడా లేదా అనేదే మాత్రమే చూస్తారు. పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ లో ఆయనకీ ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే బండ్ల గణేష్ ప్రసంగాలు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇబ్బందులు కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయటా.ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో అందరికీ కూడా తెలిసిందే.

‘ఈశ్వర పవనేశ్వర’ అంటూ ఆయన ఇచ్చిన ప్రసంగం చాలా పెద్ద హిట్ అయ్యింది. దాంతో పాటు ఆయన పొలిటికల్ పరంగా కూడా అధికార పార్టీ పై విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ రిలీజ్ వేళ పొలిటికల్ గా వెళ్లి విమర్శలు చేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వకీల్ సాబ్ చిత్రంపై సరికొత్త జీవోని ప్రయోగించి అతి తక్కువ రేట్స్ తో సినిమాని రన్ చేసుకునేలా చేసి కలెక్షన్స్ దెబ్బకొట్టిందటా.. ఫలితంగా వకీల్ సాబ్ చిత్రం ఘోరంగా నష్టపోయిందని తెలుస్తుంది.

ఇది దృష్టిలో ఉంచుకునే బండ్ల గణేష్ ప్రసంగాలతో డ్యామేజ్ బాగా జరుగుతోందని గ్రహించిన పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనని బాగా దూరం పెట్టేసాడని తెలుస్తుంది.. నా దేవుడికి నన్ను దూరం చేస్తావా అంటూ అప్పటి నుండి బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తూనే ఉన్నాడటా..

తాజా గా  త్రివిక్రమ్ శ్రీనివాస్ పై డైరెక్ట్ అటాక్స్ చేస్తున్నాడటా . పవన్ కు , బండ్ల గణేష్ కు మధ్య దూరం పెరగడానికి త్రివిక్రమ్ కారణం అనే మాట బలంగా పాతుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: