సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ మూవీ మేకర్స్ "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇది వరకు మహేష్ హీరోగా రూపొందిన మహర్షి సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇది మహేష్ ... పూజ హెగ్డే కాంబినేషన్ లో రెండవ సినిమా కాగా మహేష్ ... శ్రీ లీల కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యూనిట్ విడుదల చేయబోయే ఫస్ట్ గ్లిమ్స్ వీడియోపై మహేష్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఎలా ఉంటే తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగులు ఉంది అని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మహేష్ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ ప్యాంట్ ను ... చెక్స్ షర్టును ... శాండిల్స్ చప్పల్స్ ను వేసుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ కు సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: