రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటికే. ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ లోను ... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు కే మూవీ లోను ... మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ షూటింగ్ లోను పాల్గొంటూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ చాలా రోజుల తర్వాత మారుతి సినిమాలో లవర్ బాయ్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ప్రభాస్ వేషధారణ , బాడీ లాంగ్వేజ్ , యటిట్యూడ్ అన్నీ కూడా మిస్టర్ పర్ఫెక్ట్ , డార్లింగ్ , బుజ్జి గాడు సినిమాలో లగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ఇలా ప్రభాస్ చాలా సంవత్సరాల తర్వాత వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడు అని తెలియడంతో ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ , రీద్దీ కుమార్ లు హీరోయిన్ లుగా నటించబోతున్నారు. సంజయ్ దత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయ్యింది.

ఇకపోతే గత కొన్ని రోజులుగా ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ... మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా రెండు భాగాలగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తుంది. ఈ మూవీ కేవలం ఒక భాగంగానే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: