తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఆఖరుగా అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన అలా వైకుంటపురంలో సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా సాధించింది. అలా వైకుంఠపురంలో మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు కొన్ని రోజుల క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా టైటిల్ ను ప్రకటించింది. మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి "గుంటూరు కారం" అనే టైటిల్ ను మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. అలాగే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేయగా ఆ వీడియోకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ ... ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక మూవీ చేయబోతున్నాడు.

మూవీ తర్వాత మూవీ కోసం ఇప్పటి నుండే త్రివిక్రమ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తో మూవీ పూర్తి అయిన వెంటనే ప్రభాస్ తో మూవీ చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ... అందులో భాగంగా ప్రభాస్ కు కథను వినిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అన్ని కుదిరి త్రివిక్రమ్ చెప్పిన కథ ప్రభాస్ కనుక నచ్చినట్లయితే వీరి కాంబినేషన్ లో ఒక మూవీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: