టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్  సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు గుంటూరు కారం  అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే మహేష్ బాబు సినిమా షూటింగ్ సమయంలో తనకు ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతకుమించి ఈయన బయట ఇతర పార్టీలలో ఎక్కడ కనపడరు. ఇక చాలా కావాల్సిన వారి పార్టీలకు మాత్రమే అటెండ్ అవుతూ ఉంటారు.

ఇలా మహేష్ బాబు చాలా తక్కువగా పార్టీలలో అటెండ్ అవ్వడం మనం చూస్తున్నాము. అయితే తాజాగా ఈయన ఉపాసన కజిన్ సిస్టర్ శ్రియ భూపాల్ బేబీ షవర్  వేడుకలకు హాజరయ్యారు.తన స్నేహితులతో కలిసి నమ్రత మహేష్ బాబుతో పాటు సితార కూడా ఈ వేడుకకు హాజరయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ వేడుకలలో భాగంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో దిగినటువంటి ఫోటోలను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన మహేష్ బాబు వాట్ ఎ ఫన్ నైట్ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో మహేష్ బాబు ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. బ్లాక్ కలర్ టీ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్ గా మహేష్ బాబు కనిపించడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలపై అభిమానులు స్పందిస్తూ మహేష్ బాబు అందంపై కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటివరకు ఏ పార్టీలో కూడా ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపించడం చూడలేదు అంటూ మరికొందరు కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇక నమ్రత సైతం ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసిన నమ్రత మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీకి వెళ్ళాము. పార్టీ చాలా బాగా జరిగింది. బహుశా తన కుమార్తెతో కలిసి పార్టీకి వెళ్లడం ఇదే మొదటిసారి. తను కూడా తన తండ్రి లాగా పార్టీలో బాగా అల్లరి చేసింది అంటూ ఈ సందర్భంగా నమ్రత ఈ ఫోటోలను షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: