హీరోయిన్ విదిషా శ్రీవాస్తవ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె తెలుగుతో పాటు కన్నడం తమిళం మలయాళం సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకుంది.కాగా భాభిజీ ఘర్ పర్ హైన్ సీరియల్ ద్వారా భారీ గా పాపులారిటీ ని కూడా సంపాదించుకుంది విదిషా శ్రీవాస్తవ. ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె గర్భం ధరించినట్లు అయితే వెల్లడించింది. త్వరలోనే బిడ్డకు జన్మినివ్వబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోల ను కూడా పంచుకుంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న బాలీవుడ్ నటి జూలై లో తమ మొదటి బిడ్డను స్వాగతించడాని కి సిద్ధం గా ఉన్నట్లు కూడా తెలిపింది.

తాజాగా ఈ నటి మెటర్నిటీ షూట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా విదిషా టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళ మరియు మలయాళ చిత్రాల్లో నటించింది. మా ఇద్దరి మధ్య అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అలా, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ అలాగే దేవరాయ సినిమాలలో నటించింది. ఓకే ఏడాది లో తెలుగులో ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదల అయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్ సినిమా లో విదిషా శ్రీవాస్తవ ముఖ్య పాత్రలో కనిపించింది. ఈ చిత్రం లో రియా పాత్రలో ఆమె మెప్పించింది. ఇకపోతే విదిషా శ్రీవాస్తవ 2018 డిసెంబర్లో సాయక్ పాల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన విదిషా డెలివరీ తర్వాత ముంబయి కి వెళ్లనున్నట్లు తెలిపింది. కాగా తాజాగా తాను షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. అలాగే పలువురు సెలబ్రెటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: