ప్రస్తుతం కాలం చాలా మారిపోయింది దానికి తోడు ప్రజల జీవనశైలి ఆహారపు అలవాట్లు ఆలోచన విధానం ఇలా ప్రతి ఒక్కటి కూడా మారిపోయాయి. ఇదివరకటి రోజుల్లో తల్లిదండ్రులు నిర్ణయాన్ని పిల్లలు కాదనే వారు కాదు.అంతేకాకుండా ఏ విషయంలోనూ తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవారు కాదు. కానీ కాలం మారిపోవడంతో ఈ జనరేషన్ లో పిల్లలు చెప్పిన మాటలనే పెద్దలు వినాల్సిన పరిస్థితులు వచ్చాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో స్నేహభావంగా మెలుగుతున్నారు. అలాగే ప్రతి విషయాన్ని పేరెంట్స్తో షేర్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలుసుకుని వానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు.

పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతలను పాలు పంచుకుంటున్నారు. కొందరు సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్లు వారి బాగోగులు చూసుకోవడానికి పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. పిల్లలే ముందుండి పేరెంట్స్కు అండగా నిలబడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరగగా తాజాగా ఒక బుల్లితెర నటి కూడా తన తండ్రికి మళ్ళీ పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది. బుల్లితెర నటి మరెవరో కాదు సుంబుల్ తౌకీర్.హిందీ బిగ్ బాస్ సీజన్ 16 ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్న ఈమె బుల్లితెర నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి తౌకీర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

పెళ్లి చాలా దగ్గరగా ఉండడంతో తనే దగ్గరుండి అన్ని చూసుకోవాలని అభిమానులకు తెలిపింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. కొత్త దంపతులను మా కుటుంబంలోకి స్వాగతిస్తాము. దీనికి మేము ఆతృతతో ఎదురుచూస్తున్నాము. మా నాన్నగారికి వచ్చే భార్యతో పాటు ఒక కొత్త సోదరి కూడా మా ఫ్యామిలీలోకి వస్తుంది అని అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. తండ్రి పెళ్లిచేసుకోబోయే ఆవిడ పేరు నీలోఫర్ అని, ఆమెకు ఇంతకుముందే పెళ్లై విడాకులు తీసుకుందని తెలిపింది. తనకు రెండేళ్ల పాప కూడా ఉందని తెలిపింది. సుంబుల్ ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుండి నాన్న తమతో ఉన్నాడని, ఏనాడు అసౌకర్యంగా ఫీలవలేదని చెప్పింది. తను మొదటిసారి పీరియడ్స్ అయినప్పుడు తల్లి పక్కన లేక ఈ విషయాన్ని తండ్రితోనే షేర్ చేసుకున్నానని సుంబుల్ ఎమోషన్ అయింది. తన జీవితంలో ముఖ్య ఘటనలు వాళ్ల నాన్నే ముందు నడిచాడని ఆమె చూపుకొచ్చింది. చిన్నప్పటి నుండి కష్టపడి మా కోసం సర్వం ధారపోసి పెంచిన తండ్రికి ఒక తోడును ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. నాన్న సంతోషంగా ఉండాలని తను, తన సోదరి సానియా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని సుంబుల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: