ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల లిస్టులో ‘ఓజీ’ పై విపరీతంగా అంచనాలు ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో పవన్ గ్యాంగ్ ష్టర్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో సుజిత్ పవన్ ను సూపర్ స్టైలిష్ట్ గా కనిపిస్తాడని పవన్ పాత్ర ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.
పవన్ నటిస్తున్న సినిమాలలో ఈ మూవీ చాల ఆలస్యంగా ప్రారంభం అయినప్పటికీ ఈ మూవీ షూటింగ్ మాత్రం చాల వేగంగా జరుగుతోంది. ఈ మూవీలో నటించినందుకు పవన్ కళ్యాణ్ కు 75 కోట్ల పారితోషికం ఇస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా గ్యాంగ్ స్టర్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లీక్ అయిన ఫోటోలు ప్రోమోలను బట్టి ఒక ఆసక్తికరమైన న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఈ మూవీ ఒక పీరియడిక్ మూవీ అని అయితే అన్ని సినిమాలకు ఇప్పైవరకు వచ్చిన ఫ్లాష్ బ్యాక్ కధలులా 20 - 30 సంవత్సరాల క్రితం కథ కాకుండా 1950 ప్రాంతంలో నడిచే కథగా దీన్ని ఒక ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపెడతారు అని అంటున్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సెట్స్ ను కూడ చాల డిఫరెంట్ గా డిజైన్ చేసారట.
సుజీత్ తన సినిమాలను చాల స్టైలిష్ గా తీస్తాడు. ఈ మూవీలో ఒక కీలక పాత్ర కోసం తమిళ నటుడు అర్జున్ దాస్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కార్తి నటించిన ‘ఖైదీ’ మూవీతో ఈ నటుడుకి మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో ఆమధ్య ‘బుట్టబొమ్మ’ సినిమాలో నటించాడు. ఈమూవీలో అతడి పాత్ర చాల కీలకం అని అంటున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి రాబోతున్న ఈమూవీని ‘ఆర్ ఆర్ ఆర్’ తీసిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి