మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకులకు అవకాశాలు ఇస్తూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక భోళా శంకర సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి  ఏ సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు .కానీ తన పెద్ద కూతురు సుస్మిత నిర్మాణంలో చిరంజీవి ఒక సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా విజయం తరువాత చిరంజీవి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో సుష్మిత సైతం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో ఖచ్చితంగా ఒక సినిమా నిర్మించాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

కాగా ఈ సినిమాని బంగారు రాజు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. అయితే సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే సొంత బ్యానర్ స్థాపించింది. ఇందులో తన తండ్రి సినిమాని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుస్మితకు చాలామంది నిర్మాతల నుండి కళ్ళు చెదిరే ఆఫర్లు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది .చిరంజీవి సినిమాకి తాము కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటామని సుస్మితని అడిగారట.

అంతేకాదు బడ్జెట్ మొత్తాన్ని తామే భరిస్తామని కేవలం లాభాల్లో మాత్రమే వాటా ఇస్తే చాలుని అడిగారట. ఇక ఇంత అద్భుతమైన ఆఫర్ వచ్చినప్పటికీ వారికి ఊహించిన షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తన తండ్రితో ఆమె నిర్మించబోయే మొదటి సినిమా కాబట్టి ఎన్ని కష్టనష్టాలు వచ్చినా సరే తానే భరించాలని అనుకుంటుందట. ఇంకొకరి ప్రమేయం ఉండొద్దని అంటుందట సుస్మిత. అంతేకాదు చిరంజీవి చెప్పినప్పటికీ ఈ విషయంలో సుస్మిత ఏమాత్రం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. సొంతంగా తానే ఈ సినిమాని నిర్మించేందుకు సిద్ధంగా ఉందట సుస్మిత .ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: