ముఖ్యంగా ఖుష్బూ కు వెన్నుముక సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్లో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కుష్బూ ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి వచ్చింది. కానీ ఆ సమస్య నుంచి ఇంకా ఆమె కోలుకోలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెన్నుముక సమస్యతోనే మల్లి తిరిగి హాస్పిటల్ కి అడ్మిట్ అయినట్లుగా తెలుస్తోంది ఖుష్బూ.. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఫోటోలను సైతం షేర్ చేసింది. ఇందులో తెలియజేస్తూ కోకీస్స్ బొన్ చికిత్స కోసం నేను మళ్ళీ ఆస్పత్రికి వచ్చాను అంటూ ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాను ఈసారైనా పూర్తిగా కోలుకోవాలని విధంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది ఖుష్బూ.
ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారడంతో చూసిన అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు .ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం కాస్త ఆందోళన చెందుతూ ఉండగా మరి కొంతమంది మాత్రం త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు రెండు నెలల క్రిందట ఖుష్బూ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ కోసం వెళ్లడం జరిగింది. అడైన వైరస్ అనే అరుదైన రోగం బారిన పడడంతో ఏప్రిల్ నెలలో ఆస్పత్రి పాలైన కుష్బూ దాని నుంచి కోలుకోవడానికి సుమారుగా రెండు నెలల సమయం పట్టింది మళ్లీ ఇప్పుడు ఇలా అవ్వడంతో అభిమానులు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి