హలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని మాత్రమే కాదు, ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన చిత్రాలలో ఒకటి జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన 'టైటానిక్'అనే చిత్రం.ఆరోజుల్లో ఈ సినిమా హాలీవుడ్ తో పాటుగా మన ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేసింది. 1997 వ సంవత్సరం లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది అట. రెండు బిలియన్ డాలర్లు అంటే అక్షరాలా 16 వేల కోట్ల రూపాయిలు అన్నమాట. ఇప్పటితో పోలిస్తే అప్పట్లో టికెట్స్ రేట్స్ కనీసం లెక్కలోకి కూడా వచ్చేవి కాదు. అయినా కూడా ఈ స్థాయి వసూళ్లు అంటే అప్పట్లో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికీ ఈ సినిమా హాలీవుడ్ టాప్ 5 చిత్రాలలో ఒకటిగా ఉంటుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

అయితే ఈ సినిమాని అప్పట్లో తెలుగు లో రీమేక్ చెయ్యాలని ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నం చేసాడట. హీరో గా రామ్ చరణ్ ని కానీ, లేదా ప్రభాస్ ని కానీ పెట్టి తియ్యాలనుకున్నారు. అప్పటికే మన టాలీవుడ్ లో మగధీర చిత్రం విడుదలై, సంచలన విజయం సాధించి మన మార్కెట్ ని రెండింతలు ఎక్కువ చేసింది. రాజమౌళిని దర్శకుడిగా పెట్టి ఒక్క వర్క్ షాప్ నిర్వహించి ట్రైల్స్ వేశారు. అలా లెక్కలు అన్నీ చూసుకుంటే ఆరోజుల్లోనే బాహుబలి చిత్రానికి అయ్యేంత బడ్జెట్ అయ్యిందట. తీస్తే కచ్చితంగా బొక్క బోర్లా పడుతాము, చేయకపోవడమే మంచిది అని రాజమౌళి చెప్పడం తో ఈ సినిమాని రీమేక్ చెయ్యాలనే ఆలోచనని పక్కన పెట్టేశారట. 2011 సంవత్సరం లోనే మన దగ్గర అంత టెక్నాలజీ మరియు బడ్జెట్ లేక ఈ చిత్రాన్ని తియ్యలేకపోతే, 1997 వ సంవత్సరం లో అంత టెక్నాలజీ ని ఉపయోగించి , జేమ్స్ కెమరూన్ ఎలా ఈ సినిమాని తియ్యగలిగాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఈ చిత్రం లోని టైటానిక్ షిప్ సన్నివేశాలన్నీ బ్లూ మ్యాట్ లోనే తెరకెక్కించారు, దానికి సంబంధించిన మేకింగ్ వీడియోలు మనం యూట్యూబ్ లో చూడవచ్చు. సినిమా చూస్తున్నంత సేపు మనం నిజంగానే సముద్రం లో ఉన్న సన్నివేశాలను చూస్తున్నట్టుగానే అనిపించింది. అంత సహజం గా ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారు అనేది ఇప్పటికీ పెద్ద సర్ప్రైజ్. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా కలెక్షన్స్ ని మళ్ళీ జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన 'అవతార్' చిత్రమే దాటింది. అప్పటి వరకు ఒక్క హాలీవుడ్ చిత్రం కూడా ఈ సినిమాకి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఇక రీసెంట్ గా ఈ చిత్రాన్ని 3D వెర్షన్ కి మార్చి రీ రిలీజ్ చేస్తే సుమారుగా 300 మిలియన్ డాలర్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: