అయితే రాజమౌళి కెరియర్ లో ఇలా సూపర్ హిట్ సాధించి ఎవర్ గ్రీన్ గా మిగిలిపోయిన సినిమాలలో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిన కూడా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి మరి వీక్షిస్తూ ఉంటారు. కాగా ఈ సినిమాలో రవితేజ అత్తిల్లి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. రవితేజ సరసన అనుష్క నటించింది.
అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని కొంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ముందుగా ఈ సినిమాను బాలకృష్ణతో తీయాలని రాజమౌళి అనుకున్నాడట. అయితే జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని కథ రాశాను అని చెప్పాడట. దీంతో ముందుగా బాలకృష్ణను సంప్రదించిన జక్కన్న బాలయ్య నో చెప్పడంతో పవన్ కళ్యాణ్ కు ఈ కథ వినిపించాడట. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఇక రవితేజతో ఈ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడట రాజమౌళి. ఇక సినిమాలో విలన్ పాత్ర కోసం అజయ్ కంటే ముందు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ని అనుకున్నారట. కానీ అప్పట్లో టాలీవుడ్ పై ఉన్న చిన్నచూపు కారణంగా వివేక్ ఒబెరాయ్ రాజమౌళి సినిమాను ఒప్పుకోలేదు అన్న టాక్ కూడా వినిపించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి