పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి రన్ రాజా రన్ ... సాహో మూవీ లకు దర్శకత్వం వహించినటువంటి యువ దర్శకుడు సుజత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ లో పవన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ప్రారంభించింది. అలాగే ఈ మూవీ షూటింగ్ లో ఇప్పటికే పవన్ మరియు ప్రియాంక లు పాల్గొన్నారు. అందులో భాగంగా వీరిద్దరిపై ఇప్పటికే ఈ మూవీ బృందం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. 

మూవీ మొదటి షెడ్యూల్ ముంబై లో ప్రారంభం అయింది. ఆ తర్వాత ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మూడవ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను తెలియ జేస్తూ ప్రకటించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది.ఇలా ఉంటే ఈ మూవీ బృందం ఈ మూడవ షెడ్యూల్ లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూడవ షెడ్యూల్ తో ఈ సినిమాకు సంబంధించిన 50% షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: