
కే విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాలో సోనాలి బింద్రే మరొక హీరోయిన్ గా నటించింది. 2002లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ నాగార్జున కేలియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా కొనసాగుతూ ఉంది. కాగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో నాగార్జున ప్రియురాలు మహేశ్వరిగా నటించిన అన్షు అంబానీ ఇక అటు ప్రేక్షకులకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. తన కోర చూపులతో కుర్ర కారు మతిపోగట్టేసింది. ఇక కొత్త అమ్మాయి కావడంతో ఎవర్రా బాబు ఇంత అందంగా ఉంది అంటూ ఈ అమ్మాయి గురించి ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకున్నారు.
తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది అన్షు అంబానీ. ఆ తర్వాత ప్రభాస్ తో రాఘవేంద్ర, మిస్సమ్మ లాంటి సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. ఇక లండన్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ లండన్ కు చెందిన వ్యక్తినే పెళ్ళాడి అక్కడే సెటిల్ అయిపోయింది. సచిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరమై 20 ఏళ్ళు అవుతున్న ఆమె అందం మాత్రం చెక్కుచెదరలేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ తో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల తన ఫ్యామిలీ ఫోటోలను పోస్ట్ చేసింది అన్షు అంబానీ. కాగా ఈ హీరోయిన్ కి కూతురు కుమారుడు ఉన్నాడు. కాగా ఇటీవల తన కూతురితో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేయగా.. ఇది చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అన్షు అంబానీనే అనుకున్నాం కానీ ఆమె కూతురు తల్లి కంటే గొప్ప అందగత్తె అంటూ నేటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.
