కేవలం హిందీలో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా షారుక్ ఖాన్ నటించిన పటాన్ సినిమా సూపర్ హిట్ నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది అని చెప్పాలి. ఏకంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది ఈ సినిమా. అయితే ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న షారుక్ ఖాన్ ఇక ఇప్పుడు జవాన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రివ్యూ వీడియో సోషల్ మీడియాలో అందరిని ఆకర్షించింది. అయితే జవాన్ సినిమాలో విలన్ ఎవరు అనే విషయంపై గత కొంతకాలం నుంచి ఆసక్తికర చర్చ జరుగుతుంది.
అయితే విజయ్ సేతుపతి అటు షారుఖ్ ఖాన్ ఢీకొట్టే విధంగా నటించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా విజయ్ సేతుపతి ముంబైకర్ అనే సినిమాతో బాలీవుడ్కు పరిచయమయ్యాడు. ప్రస్తుతం జవాన్ లో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నటించడానికి గల కారణాన్ని సేతుపతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. షారుక్ ఖాన్ కోసమే జవాన్ సినిమాలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కూడా ఇక షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించేవాడిని అంటూ తెలిపాడు. సాదరణంగానే విజయ్ సేతుపతి ఏ పాత్ర కైన ప్రాణం పోస్తాడు. మరి షారుక్ ఖాన్ ఢీకొట్టే విలన్ పాత్రlo ఎలాంటి పవర్ఫుల్ నటన చూపిస్తాడో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి