ఇలా ఇండియా గౌరవాన్ని నిలబెట్టిన చంద్రయాన్ 3 మిషిన్ ఖరీదు కంటే ఇక భారీ బడ్జెట్ సినిమాలకే ఎక్కువ ఖర్చు అయింది అన్న విషయాన్ని ప్రస్తావనకు తీసుకువస్తున్నారు అని చెప్పాలి. ఆ డీటెయిల్స్ చూసుకుంటే.. చంద్రయాన్ త్రీ కోసం మొత్తం 615 కోట్లు ఖర్చు చేసింది ఇస్రో. ఇక ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు విజయవంతంగా చంద్రయాన్ 3ని నింగిలోకి పంపింది. అయితే చంద్రయాన్ కంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చయిన సినిమాలు ఏవో తెలుసుకుందాం..
త్రిబుల్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాకు నిర్మాత దానయ్య దాదాపు 630 కోట్ల వరకు ఖర్చు చేశాడు. ఇందులో 500 కోట్లు మూవీ మేకింగ్ కి.. 50 కోట్లు ప్రమోషన్స్ కి.. 80 కోట్లు క్యాంపెయిన్ కోసం వెచ్చించారు దానయ్య.
ఆది పురుష్ : ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా రామాయణం ఇతిహాసంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఆది పురుష్ మూవీ ఏకంగా 700 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. ఈ మూవీ మేకింగ్ కోసం 500 కోట్ల బడ్జెట్ కాగా.. విమర్శల తర్వాత గ్రాఫిక్స్ చేంజ్ చేయడం కోసం 200 కోట్లు ఖర్చు చేశారట. మొత్తంగా 700 కోట్లకు ఈ సినిమా బడ్జెట్ చేరుకుంది.
ప్రాజెక్ట్ కే : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకొనే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రాజెక్టు-కే మూవీ బడ్జెట్ కూడా 700 కోట్లు కావడం గమనార్హం. మూవీ మేకింగ్ కి 600 కోట్లు కాగా ఇక రానున్న రోజుల్లో ఈ సినిమాకు చేసే ప్రమోషన్స్.. మార్కెటింగ్ అన్నీ కలిపి సులభంగా 700 కోట్ల రూపాయలు బడ్జెట్ దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి