ప్రతి వారం "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో భాగంగా వచ్చే వారం కూడా అనేక తెలుగు సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతున్నాయి. అందులో ఓ రెండు క్రేజీ సినిమాలు ఉన్నాయి. అవి ఏవి ..? అవి ఏ తేదీన ... ఏ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

పరేషాన్ : మసుద సినిమాతో మంచి గుర్తింపును సంపాదించున్న తిరువీర్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను సోనీ లివ్ డిజిటల్ ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఆగస్టు 4 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

రంగబలి : టాలీవుడ్ యువ నటుడు నాగ శౌర్య హీరోగా రూపొందిన ఈ సినిమాకు పవన్ బాసం శెట్టి దర్శకత్వం వహించగా ... సుధాకర్ చేరుకోరి ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఆగస్టు 4 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి థియేటర్ లలో యావరేజ్ విజయం అందుకున్న ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: