తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ ప్రస్తుతం లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. త్రిష చాలా సంవత్సరాల తర్వాత విజయ్ సరసన ఈ మూవీ లో హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

 ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను కూడా విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొత్తం పూర్తి అయింది. కాకపోతే ఈ సినిమాకు సంబంధించిన కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండడంతో ఈ మూవీ మేకర్స్ మరి కొన్ని రోజుల్లోనే ఆ ప్యాచ్ వర్క్ షూటింగ్ ను కాశ్మీరులో మొదలు పెట్టబోతున్నట్లు ... మూడు రోజుల పాటు ఈ మూవీ బృందం ఈ షూటింగ్ ను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన "వి ఎఫ్ ఎక్స్" పనులు కూడా ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ఆడియో లాంచ్ మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ లో నిర్వహించడానికి ఈ మూవీ బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: