నారప్ప వంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తాజాగా పెద కాపు -1 అనే చిత్రంతో పొలిటికల్ డ్రామాగా ఒక సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో విరాట్ కర్ణ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రేక్షకులలో ఇంటెన్సిటీని కలిగించే ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాలో ఒక కీలకమైన రోల్ ప్లే చేస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే విడుదలైన టీజర్ తన నుంచి ఫస్ట్ లుక్ ని రివిల్ చేయగా ఆ తర్వాత విడుదల అయ్యే ట్రైలర్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.


శ్రీకాంత్ అడ్డాల ప్లే చేసే రోల్ ఈ సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని చిత్ర బృందం తెలియజేస్తోంది. ఇప్పటికి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో బాగా మాస్ బజ్ ఏర్పడేలా చేసింది. ఇక త్వరలో విడుదలయ్యే ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి మిక్కీ జేయయర్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు గతంలో ఫ్యామిలీ చిత్రాలను తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల ఈ మధ్యకాలంలో వైలెన్స్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.


పెద కాపు వంటి అగ్రెసివ్ మాస్ ఫిలిం వస్తోంది అంటూ చాలా కొత్తగా ఫీల్ కలిగింది అంటూ పలువురు ఆడియన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. నాగబాబు, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, అనసూయ, రావు రమేష్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 29న ఈ సినిమా విడుదల కాబోతోంది. పేద కాపు సినిమా ట్రైలర్ ఈరోజు ఉదయం 11:45 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది మరి ట్రైలర్తో ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: