బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పింది కత్రినా. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా ముద్ర పడినప్పటికీ వరుసగా అవకాశాలను అందుకుంటున్న ఉంది అని చెప్పాలి. అయితే బాలీవుడ్ లో మాత్రమే కాదు అటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితురాలే. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విక్టరీ వెంకటేష్ సరసన మల్లేశ్వరి అనే సినిమాలో నటించింది కత్రినా.


 ఇక ఈ మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్ అందం అభినయానికి తెలుగు ప్రేక్షకులు అందరూ కూడాఫిదా అయ్యారు. అయితే మూవీ సక్సెస్ అయింది. కానీ కత్రినా కైఫ్ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత పెద్దగా టాలీవుడ్లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ హాట్ హీరోయిన్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. కత్రినా కైఫ్ ఏకంగా ఒక తెలుగు హీరోని దారుణంగా మోసం చేసిందట. విక్టరీ వెంకటేష్ సాధారణంగా గొడవలకు దూరంగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే.


 అలాంటి వెంకటేష్ ని కత్రినా కైఫ్ దారుణంగా మోసం చేసిందట. వీరిద్దరి కాంబోలో మల్లేశ్వరి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో కత్రినా బాలీవుడ్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే అక్కడ స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించిన తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఈ హీరోయిన్. ఇక వెంకటేష్ తో మాత్రం సన్నిహితంగానే ఉంది. అయితే ఆ తర్వాత వెంకీ ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమా చేసాడు. డైరెక్టర్ సెల్వరాఘవన్  హీరోయిన్గా ఎవరిని తీసుకుందామని వెంకటేష్ అడిగితే.. కత్రినా అయితే బాగుంటుందని ఆమెను నేను ఒప్పిస్తాను అంటే మాటిచ్చాడట. ఇక వెంకటేశ్ చెప్పడంతో కత్రినా  కూడా ఒప్పుకుందట. కానీ సరిగ్గా షూటింగ్ సమయానికి  హ్యాండ్ ఇచ్చిందట. ఆమె మేనేజర్ కి ఫోన్ చేస్తే వేరే సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చేసింది అని చెప్పాడట. దీంతో కత్రినా చేసిన మోసంతో వెంకటేష్ ఎంతో బాధపడ్డాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: