టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా ... ప్రవీణ్మూవీ కి దర్శకత్వం వహించాడు. మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భారీ ఎత్తున విడుదల అయింది. మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను వసూలు చేయలేదు.

ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్ మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ కి కాస్త సమయం తీసుకున్న నాగార్జున తాజాగా నా సామి రంగ అనే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం నాగార్జున కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను కూడా విడుదల చేసింది. వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం నుండి ఈ చిత్ర బృందం ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాటలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి ఆశిక రంగనాథ్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఎమిగోస్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: