మాస్ మహారాజా రవితేజ ఆఖరుగా రావణాసుర అనే సినిమాలో హీరోగా నటించాడు. సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోవడంలో ఈ మూవీ ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవడం మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో కలక్షన్ లను కూడా వసూలు చేయలేకపోయింది. ఇకపోతే రావణాసుర లాంటి ఫ్లాప్ తర్వాత రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించగా ... గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే  కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ కేజీ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు తాజాగా రవితేజ మరియు గాయత్రీ భరద్వాజ్ పై అరకు లో ఓ సాంగ్ ను చిత్రీకరించారు. ఇకపోతే ఈ సాంగ్ చిత్రీకరణ తాజాగా పూర్తి అయింది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ షూటింగ్ తో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బృందం వారు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: