
అయితే ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే సక్సెస్ అయిన సమంత.. అటు రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదులుకొని ఎదుర్కొంది అని చెప్పాలి. సిద్ధార్థ్ తో ప్రేమలో పడిన సమంత అతని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ అనూహ్యంగా సిద్ధార్థ్ కి బ్రేకప్ వచ్చేసింది. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో అయినా నాగచైతన్య తో లవ్లో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. చివరికి 2021 లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుంచి సమంత సింగిల్గానే ఉంటుంది అని చెప్పాలి. అయితే సమంత విడాకుల తర్వాత తరచూ వార్తలు నిలుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సమంత గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారి పోయింది. ఏకంగా సమంత జాతకం లో మూడు పెళ్లిళ్లు ఉన్నాయట. సమంత జాతకం ప్రకారం మూడు సార్లు పెళ్లి అవుతుందని ఒక ప్రచారం చక్కర్లు కొడుతుంది. అయితే మూడుసార్లు వివాహం జరిగిన ఆమెకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం మాత్రం ఉండదట. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది.