టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ప్రతిచుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం మహేష్ బాబుతో తీయబోయే సినిమా స్క్రిప్ట్ పనులలో  బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి కధ కథనం అద్భుతంగా కుదిరాయి అని రాజమౌళి రెండేళ్లలో ఈ సినిమా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి సమర్పకుడిగా రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా మరో డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు అన్న వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

ఇక అసలు నిజం ఏంటి అంటే రాజమౌళి ఇండియన్ సినిమా పై ఒక డాక్యుమెంటరీ చేయబోతున్నారు అని ఈ సినిమా థియేటర్ సినిమా కాదు అని అంటున్నారు. ఓటిటీ సంస్థ కోసం రాజమౌళి ఈ డాక్యుమెంటరీ దిశగా అడుగులు వేస్తున్నారు అన్న వార్తలు వినబడుతున్నయి. మరొకవైపు మహేష్ బాబుతో సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి బయటి బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశం లేదు అని అంటున్నారు చాలామంది. తన సన్నిహితుల సహాయంతో రాజమౌళి సొంతంగా సినిమాలను నిర్మించాలి అన్న ఆలోచనలు ఉన్నారట రాజమౌళి.

ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని ఈ వార్త విన్న చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి తన సినిమాలకు కళ్ళు చేదురే స్థాయిలో లాభాలను తీసుకొస్తున్నాడు. ఈ దిశగా అడుగులో వేయడంతో ఆ లాభాలు అన్నీ కూడా రాజమౌళికి రావడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట. అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. కే ఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 2026 లో ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: