కొరటాల శివ దర్శకత్వం లో jr ntr రాబోయే చిత్రం “దేవర”, ప్రధానంగా జాన్వీ కపూర్ తెలుగు లో కి ఎంట్రీ ఇస్తుండటం తో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కు ముందు గానే విడుదల చేయాలనీ లేదా షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలనీ ప్రొడక్షన్ టీమ్ లక్ష్యం గా పెట్టుకుంది. దీంతో అన్ని విభాగాలు సినిమా ను వేగవంతం చేయడాని కి వారు శ్రద్ధగా పనిచేస్తున్నారు. jr ntr పట్ల టీడీపీ లోని కొన్ని వర్గాల కారణం గా ఈ అత్య వసరం ఏర్పడింది.ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించడాని కి దేవర సినిమా ను ఉపయోగించుకోవాలని మరికొంత మంది టీడీపీ నాయకులు భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో మౌనం గా ఉన్న జూనియర్, ఎన్నికల సమయంలో దేవరను విడుదల చేస్తే టీడీపీ ఆగ్రహం కొంత వరకు తగ్గుతుందని, అనవసరమైన ఇబ్బందులు మరియు వివాదాల ను నివారించవచ్చని అంచనా. దీంతో ఎన్నికల కు ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దేవర టీం గట్టి గా నిర్ణయించు కుంది.

ఇక దేవర సినిమా షూటింగ్ విషయం లో దర్శకుడు కొరటాల శివ ఏమాత్రం తగ్గడంలేదు. అనుకున్న సమయాని కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు. ఇందు కోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు వెలుతున్నారు మేకర్స్. పలు వాయిదాల తరువాత ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. తాజా గా కొత్త షెడ్యూల్ కు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇలా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ.. యమ స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు కొరటాల.

మరింత సమాచారం తెలుసుకోండి: