కోలీవుడ్ డైరెక్టర్ గా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న విగ్నేష్ శివన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు నయనతార భర్తగా మాత్రమే ఆయన సుపరిచితం. అయితే గత కొంతకాలంగా ప్రేమలో ఉండి దాని తర్వాత పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఈ జంట. నయనతార విఘ్నేశ్ జోడి కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే గతంలో సరోగసే పద్ధతి ద్వారా పిల్లలను కని కోర్టు వరకు వెళ్లారు ఈ జంట. సెప్టెంబర్ 18న విఘ్నేశ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈ జంట. 

వారు సెలబ్రేట్ చేసుకున్న విధానాన్ని అన్నిటిని కూడా ఫోటోలు వీడియోల రూపంలో ఉన్న తమ సోషల్ మీడియాలో భాగంగా తమ అభిమానులతో పంచుకున్నారు నయనతార. అయితే ఈ ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పిల్లలతో చాలా సంతోషంగా గడుపుతున్న  విగ్నేష్ తన పిల్లలకు సంబంధించిన ఫోటోలని ఎప్పటికీప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ నే ఉంటాడు. ఇక తాజాగా నయనతార తన భర్త పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ ను తెలిపింది. తను తెలపడం మాత్రమే కాకుండా తన పిల్లలతో బర్త్డే శుభాకాంక్షలు సైతం తెలుపుతూ ఫోటోలను సైతం షేర్ చేసింది.

హ్యాపీ బర్త్డే అప్ప అంటూ తన పిల్లలు తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా సిద్ధం చేసి రెండు కేకుల తెప్పించి కట్ చేయించింది నయనతార. పిల్లలు పుట్టిన తర్వాత ఇదే మొదటి పుట్టినరోజు అంటూ తను మాత్రమే కాకుండా తన పిల్లలతో కూడా శుభాకాంక్షలు తెలిపేలా చేసినందుకు నయనతారకి థ్యాంక్స్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు విగ్నేష్. అయితే వారు షేర్ చేసిన ఫోటోలో అందరూ కూడా ఒకే రకమైన బట్టలను ధరించారు. ఇక ఈ ఫోటోలో వారు ధరించిన బట్టలు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. ఇక అలా పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త మొదటి పుట్టినరోజు ని ఈ విధంగా సెలబ్రేట్ చేసింది నయనతార. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ఇటీవల జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: