మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా గాండీవదారి అర్జున అనే పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేదు. దానితో చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలి పోయింది. 

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని సెప్టెంబర్ 24 వ తేదీన నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇకపోతే థియేటర్ లలో ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తోందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: