చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నయన తార హీరోయిన్ గా చంద్రముఖి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. పి వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభు , జ్యోతిక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ఆ సమయంలో తమిళ మరియు తెలుగు భాషల్లో విడుదల అయ్యి అటు కోలీవుడ్ ... ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ లలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే భారీ కలక్షన్ లను కూడా వసూలు చేస్తుంది. ఇలా ఆ సమయంలో భారీ విజయాన్ని అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు పి వాసు , రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కంగనా రనౌత్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. 

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని సుభాష్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు లో శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ వారు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే చంద్రముఖి మూవీ అద్భుతమైన విజయం సాదించడంతో చంద్రముఖి 2 మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: