టాలీవుడ్ అప్పటి హీరోలలో హీరో రాజా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటుడు రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా సమాచారం. గత కొంతకాలంగా పాస్టర్ గా దైవ సేవలో మునిగిన ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు సమక్షంలో చేరినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ తనకు రాజకీయాలు కొత్తేమి కాదంటూ గతంలో కూడా తెరవెనుక పని చేశానని ఇప్పుడు మిముందుకు వచ్చి పని చేయాలనుకుంటున్నాను అంటూ తెలిపారు.

కేవలం ఒక రాష్ట్రం కోసమే కాదు తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సేవ చేయాలని ఉద్దేశంతోనే పార్టీలో చేరాలని కూడా తెలియజేశారు రాజా.. రాజా సినీ కెరియర్ విషయానికి వస్తే ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.. 2002లో మొదటిసారిగా ఓ చిన్నదాన అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాజా ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.


అయితే ఆ తర్వాత రాజా సినిమాల ఎంపిక విషయంలో తడబడడం జరిగింది. ఫలితంగా భారీ డిజాస్టర్లు రావడంతో సినిమా అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైన తరువాత రాజా 2013లో మరే సినిమాలో కూడా నటించలేదు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక తర్వాత రాజకీయాలలో పెద్దగా ఎక్కడ కనిపించలేదు రాజా ఇటీవలే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతంలో పాస్టర్ గా ఉన్నప్పుడు పలు విషయాలను కూడా తెలియజేస్తూ సభలకు వెళ్లేవారు రాజా. మరి రాజకీయాలలో ఎంట్రీ ఇస్తున్న రాజా సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: