
అంతే కాదు హైదరాబాద్ సిటీ లో అత్యధికసార్లు రీ రిలీజ్ అయిన చిత్రం ఇదే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకి నైజాం డిస్ట్రిబ్యూషన్ చేసాడు. ఆయనకీ డబ్బులు అవసరమైనప్పుడల్లా ఈ సినిమాని రీ రిలీజ్ చేసుకునేవాడట. అంతటి క్రేజ్ ఉన్న సినిమా ఇది, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు రీ రిలీజ్ అయ్యుంటే కచ్చితంగా పది కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొట్టి ఉండేది. అయితే ఈ చిత్రాన్ని తమిళం లో దబ్ చేసి విడుదల చెయ్యగా, అక్కడ పెద్ద హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమాని హిందీ మరియు కన్నడ భాషల్లో రీమేక్ చేసారు.కన్నడలో రవిచంద్రన్ హీరో గా 'ప్రీత్సు తప్పెనిల్లా' పేరుతో రీమేక్ అయ్యింది. అలాగే హిందీ లో తుషార్ కపూర్ హీరో గా 'ముజ్ సే కుచ్ కెహెనా హై' పేరు తో రీమేక్ అయ్యింది. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. తుషార్ కపూర్ ని హీరో గా నిలబెట్టింది.అలాగే ఈ సినిమాకి ఆయన ఫిలిం ఫేర్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది కదా అని , పవన్ కళ్యాణ్ మరో సూపర్ హిట్ చిత్రం 'బద్రి' ని రీమేక్ చేసాడు. ఇది మాత్రం కమర్షియల్ గా అక్కడ పెద్ద ఫ్లాప్ అయ్యింది.