
ఇక సినిమాలో తన పాత్ర గురించి ఎక్కువ లీక్ చేయకుండా ఈ సినిమా తర్వాత తన పాత్ర పేరుతోనే తనని పిలుస్తారని. సినిమాలో ఒక డైలాగ్ కూడా ఆడియన్స్ అందరికీ షాక్ ఇస్తుందని అన్నారు అనసూయ. అనసూయ చేత ఒక బోల్డ్ డైలాగ్ ని చెప్పించాడట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఇదివరకు ఆయన తీసిన సినిమాలతో పోల్చితే కంప్లీట్ గా ఆయన స్కూల్ మార్చేశాడని చెప్పొచ్చు.
శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1 సినిమా పొలిటికల్ కాన్సెప్ట్ తో వస్తుంది. అయితే ఈ కథకు మూలం తన తండ్రి చెప్పిన ఒకప్పటి విషయాలే అని ఆయన అన్నారు. కోవిడ్ లాక్ డౌన్ టైం లో తన ఫాదర్ చెప్పిన రియల్ స్టోరీ సినిమాగా తీయాలని అనిపించింది. అందుకే ఈ కథ రాసుకున్నానని అన్నారు శ్రీకాంత్ అడ్డాల. సినిమాలో ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. ఈమధ్య తమిళ దర్శకులు సినిమాల్లో నటిస్తున్నారు. వారి దారిలోనే ఒక పాత్ర కోసం పేరున్న నటుడిని అనుకోగా అతని డేట్స్ అడ్జెస్ట్ అవ్వట్లేదని తెలిసి ఆ పాత్రని శ్రీకాంత్ అడ్డాల నటించడం జరిగింది. కొత్త హీరోతో శ్రీకాంత్ చేసిన ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అన్నది చూడాలి. ఈ నెల 29న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.