మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో ... ఇండస్ట్రీ హిట్ మూవీ లలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికి కూడా టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చిరు తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించినప్పటికీ కొన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా విడుదల అయ్యి తమిళ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాను కూడా చిరంజీవి మిస్ చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా ... రమ్యకృష్ణమూవీ లో రజనీ కి భార్య పాత్రలో నటించింది. తమన్నా , సునీల్మూవీ లో కీలక పాత్రలలో నటించగా ... అనిరుద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే నెల్సన్ ఈ మూవీ కంటే ముందు తలపతి విజయ్ తో బీస్ట్ అనే మూవీ ని రూపొందించాడు.

సినిమా షూటింగ్ సమయం లోనే నెల్సన్ , చిరంజీవి ని కలిసి జైలర్ మూవీ కథను వినిపించాడట. కాకపోతే ఆ సమయంలో చిరంజీవి ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో నెల్సన్ ఇదే కథను రజనీ కి చెప్పి జైలర్ అనే టైటిల్ తో మూవీ తో రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇలా రజిని కెరియర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా కథను చిరంజీవి వదులుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: