అక్కినేని అఖిల్ ఆఖరుగా ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ని మొదట తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. కాకపోతే చివరకు ఈ సినిమాను కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేశారు.

ఇకపోతే అద్భుతమైన విజయవంతమైన మూవీ అయినటువంటి సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన మూవీ కావడం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత అఖిల్ హీరోగా నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ కావడంతో ఆ తర్వాత చాలా తక్కువ రోజుల్లోనే "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 

కానీ ఈ మూవీ విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇకపోతే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 29 వ తేదీన సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: