తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్న గోపీచంద్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మ్యాచో స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి గోపీచంద్ హిట్టు అనే పదానికి చాలా దూరం అయిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరైన విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయితే ఇక ఇప్పుడు మాత్రం ఎలాగైనా తన నెక్స్ట్ మూవీ తో హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా శ్రీను వైట్లతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. శ్రీను వైట్ల ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడు. ఎంతో మంది స్టార్ హీరోలతో తిరుమల తీసాడు. కానీ ఇప్పుడు శ్రీనువైట్ల అటు ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు. వరుస ఫ్లాప్స్ రావడంతో ఏ హీరో కూడా శ్రీను వైట్లతో సినిమా చేయడానికి ధైర్యం చేయట్లేదు. ఇలాంటి సమయంలో గోపీచంద్, శ్రీనువైట్ల తో మూవీకి రెడీ అవుతున్నాడు. గోపీచంద్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు అంటే శ్రీనువైట్ల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. ఇక ఈ ఫ్లాప్ కాంబినేషన్లో జరగబోతున్న సినిమాకి రెబల్ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం వరుస ప్లాప్ లు ఉండడంతో గోపీచంద్ కి పెద్దగా మార్కెట్ కూడా లేదు.


 ఓవరాల్ గా గోపీచంద్ సినిమా అంటే 30 నుంచి 35 కోట్ల మధ్య పూర్తవ్వాలి. కానీ శ్రీను వైట్ల మాత్రం గోపీచంద్ కోసం భారీ బడ్జెట్ అనుకుంటున్నాడట. అంతేకాదు ఇక సినిమా లొకేషన్స్ ని కూడా అటు గోపీచంద్ డిసైడ్ చేస్తున్నాడని టాక్. వారణాసిలో ఒక యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. అయితే ఈ ఒక్క షెడ్యూల్కే 3.5 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు ఒక టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. ఇంత ఖర్చు పెడితే మిగతా షెడ్యూల్స్ పరిస్థితి ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. సినిమా పూర్తయ్యేసరికి 60 కోట్లకు పైగానే బడ్జెట్ ఖర్చయ్యే చాన్స్ ఉందని.. ఫ్లాప్ కాంబినేషన్ కు ఇంత ఖర్చు పెట్టడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: