దాదాపు 18 ఏళ్ల నుంచి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతుంది తమన్నా భాటియా. అంతేకాదు సినీ ప్రేక్షకులందరికీ మిల్కి బ్యూటీగా దగ్గర అయింది అని చెప్పాలి. ఇక ఈ అమ్మడు అందం అభినయంతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసు కొల్లగొట్టింది. ఇక ఇప్పటికే హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది అని చెప్పాలి. సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడింది కానీ ఇక ఈ అమ్మడికి  అవకాశాలు మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ తో సమానంగా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.


 ఇక ఇప్పుడు నార్త్ లో కూడా నటిస్తూ అక్కడ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. అంతేకాదు ఇక 17 ఏళ్ల కెరియర్లో పాటించిన నో కీస్ పాలసీని కూడా పక్కన పెట్టేసి లిప్ లాక్ లకి కూడా సిద్ధం అయిపోయింది. ఇప్పటికే అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ హీరోయిన్.. ఇక ఇప్పుడు సీనియర్ హీరోల సినిమాలో ఛాన్సులు దక్కించుకుంటుంది. అయితే నందమూరి నటసింహం బాలయ్యతో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు తమన్న.  అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉందట.


 అయితే తమన్న కాకుండా మరో హీరోయిన్  సినిమాలో నటించగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందట. ఆ సినిమా మరేదో కాదు అఖండ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య కెరియర్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ పూర్ణ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో ముందుగా బాలయ్య భార్యగా జిల్లా కలెక్టర్గా ప్రగ్య ను కాకుండా తమన్న అనుకున్నారట. ఈ క్రమంలోనే సంప్రదింపులు కూడా జరిపారట మేకర్స్. కానీ తమన్న సిటీమార్, ఎఫ్ 3 సినిమాలతో బిజీగా ఉంది. దీంతో డేట్స్ కేటాయించలేకపోయింది. చివరికి ఈ ఆఫర్ ప్రగ్య దగ్గరికి వెళ్ళింది.

మరింత సమాచారం తెలుసుకోండి: