
మరోవైపు గోపీచంద్‌తో సినిమా ఆఫర్‌ని దక్కించుకుందట. ఇటీవల శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఓపెనింగ్ కూడా జరుపుకుంది. ఇందులో హీరోయిన్‌గా కావ్యా థాపర్‌ని ఫైనల్ చేశారట. దీంతో కావ్యాకిది పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే సినిమా హిట్ అయితే ఆమె నెక్ట్స్ లెవల్ కి వెళ్తుంది, లేదంటే మళ్లీ సీన్ మొదటికొస్తుంది. ఏదైనా సక్సెస్‌లే అవకాశాలు తీసుకొస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ రెండు ఆఫర్లు ఈ సెక్సీ బ్యూటీని రెండు రకాలుగా టర్న్ తిప్పబోతున్నాయి. హీరోయిన్‌గా సినిమా సక్సెస్ అయితే హీరోయిన్‌గా సినిమాలొస్తాయి. లేదంటే స్పెషల్ సాంగ్ చేస్తున్న `డబుల్ ఇస్మార్ట్ `హిట్ అయితే ఇక అలాంటి ఐటెమ్ సాంగులే ఎక్కువగా వస్తాయి. ఇది హీరోయిన్‌గా ఆమె కెరీర్‌పై ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి కావ్య కెరీర్ ఇప్పుడు రింగ్ రోడ్డుపై ఉందని చెప్పొచ్చు. మరి అది ఎటు టర్న్ తీసుకుంటుందో చూడాలి.