తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి నవీన్ తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఇకపోతే ఈ సినిమాలో తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించి ప్రస్తుతం వరుస సినిమాలతో కాకుండా కాస్త స్లోగా ఆచితూచే సినిమాల్లో నటిస్తున్న అనుష్క హీరోయిన్ గా నటించింది. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 7 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

ఇకపోతే మొదట ఈ సినిమా తెలుగు లో విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన మలయాళ భాషలో విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ కి మలయాళ ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు ప్రస్తుతం లభిస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా "యూ ఎస్ ఏ" లో మాత్రం సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1.7 మిలియన్ గ్రాస్ కలెక్షన్ లను సాధించినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే నవీన్ మరికొన్ని రోజుల్లో మైత్రి మూవీ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే అనుష్క , చిరంజీవి ... వశిష్ట కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: