తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయిన వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దు గుమ్మ రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఆ తర్వాత ఈ నటి ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో దాదాపు డజన్ కి పైగా సినిమాలు ఉన్నాయి.

అందులో భాగంగా శ్రీ లీల తాజాగా నటించిన స్కంద సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల కానుంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ కి ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ముద్దున్గుమ్మ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ డేట్ లను అడ్జస్ట్ చేయలేక వదులుకోవాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ నటి రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాకు ఈ ముద్దుగుమ్మ తేదీలను అడ్జస్ట్ చేయలేక వదులుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు ఈ నటి తేదీలను అడ్జస్ట్ చేయలేక ఈ మూవీ నుండి తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా డేట్ లను అడ్జస్ట్ చేయలేక ఈ ఇద్దరు క్రేజీ హీరోల మూవీ లను ఈ ముద్దుగుమ్మ వదులుకోబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: