విజయ్ దేవరకొండ , సమంత ప్రధాన పాత్రలో ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. శివ నర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించగా ... వషిం అబ్దుల్ వహెబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తేదీన మంచి అంచనాలు నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది.

మూవీ మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా మొదటి మూడు రోజులు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లాంజ్ వరల్డ్ వైడ్ గా దక్కించుకుంది. ఇక మూడు రోజుల తర్వాత మాత్రం ఈ సినిమా కలెక్షన్ లు దారుణంగా పడిపోయాయి. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా అక్టోబర్  1 వ తేదీ నుండి ఈ సినిమాని తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ  మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: