హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్కంద.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రామ్ కెరియర్ లోని ఈ సినిమా రూ.48.25 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. హీరో రామ్ రెగ్యులర్ సినిమాలకు మించి స్కంద సినిమా బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


స్కంద మూవీ నైజాం ఏరియా హక్కులను దిల్ రాజు 14 కోట్లకు సొంతం చేసుకున్నారు..SRR  ఫిలిం 9 కోట్లకు దక్కించుకుందట. ఇక ఆంధ్ర హక్కుల కోసం చిత్ర నిర్మాత 25 కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.. రామ్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు సైతం ఇంత ఇవ్వడానికి సిద్ధంగా లేరట. ఫైనల్ గా 20 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం.. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే 43 కోట్ల రూపాయల వరకు జరిగినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు విషయానికి వస్తే..48.5 కోట్ల రూపాయల వరకు జరిగినట్లు తెలుస్తోంది దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 50 కోట్ల రూపాయలు టార్గెట్తో ఈ సినిమా బరిలోకి దిగబోతోంది. భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా సక్సెస్ విషయానికి వస్తే పబ్లిక్ టాక్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఈ సినిమాకి సంగీతాన్ని  థమన్ అందించారు. గతంలో అఖండ సినిమాకి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా ఇవ్వడంతో ఆ సినిమాకి ప్లస్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: